పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు

20th July 2017

తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఎక్కలదేవి  మొహంకృష్ణను నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఏలె వెంకటనారాయణ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్బంగా మోహనకృష్ణ మాట్లాడుతూ పద్మశాలీల సమగ్రాభివృధి కొరకు, యువకుల్లో చైతన్యం తీసుకురావడానికి, నిరుద్యోగ నిర్మూలనకు, రాజకీయ సాధికారతకు, చేనేత కార్మికుల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. తన నియామకానికి కృషి చేసిన రాష్ట్ర అధ్యక్షుడు ఏలె వెంకటనారాయణ, కార్యదర్శి అవ్వారు భాస్కర్, సలహాదారులు ఎంపీ రాపోలు ఆనందభాస్కర్, మహిళా కార్పొరేషన్ చైర్మన్ గుండు సుధారాణిపై ధన్యవాదాలు తెలిపారు.

Back to News